పాత పంటలపై అవగాహన
న్యాల్‌కల్(జహీరాబాద్): మండలంలోని శంశల్లాపూర్ గ్రామంలో గురువారం పాత పంటల జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డీడీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాత పంటల జాతర కార్యక్రమంలోభాగంగా ఉదయం గ్రామంలో పాత పంటలతో కూడిన ధాన్యం బండ్లకు పూజలు నిర్వహించిన అనంతరం వాటిని గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాత పంటల ప్రాముఖ్యతను గురించి డీడీఎస్ ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించారు. నర్సింహులు, చుక్కమ్మ, నర్సమ్మ, దివ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment