పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
మెదక్ ఆర్డీవో రమాదేవి
మెదక్ మున్సిపాలిటీ: ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సజావుగా నిర్వహించాలని మెదక్ ఆర్డీవో రమాదేవి సూచించారు. గురువారం మెదక్ పట్టణంలో జరుగుతున్న సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలను గుర్తించాలని, భూములు, ఆదాయం, వంటి వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సర్వేలో భాగంగా విచారణలో తేలిన వివరాల ఆధారంగా అర్హుల జాబితాను రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఆర్‌ఐ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన వారికి పథకాలు
చిన్నశంకరంపేట(మెదక్): ఇందిరమ్మ పథకాల కోసం అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సర్వే నిర్వహిస్తోందని మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో లబ్ధిదారుల సర్వే నిర్వహణ కోసం అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో రైతు భరోస కోసం సాగుయోగ్యం కాని వ్యవసాయ భూములను గుర్తించి, నమోదు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... ఇందిరమ్మ అత్మీయ భరోసా, పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, రేషన్ కార్డుల జారీపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తహసీల్దార్ మన్నన్, ఎంపీడీవో దామోదర్, ఏవో ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment