వ్యవసాయేతర భూముల్ని గుర్తిస్తున్నాం
నర్సాపూర్ రూరల్: రైతుబంధు అమలు కోసం వ్యవసాయేతర భూములను గుర్తిస్తున్నట్లు నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ తెలిపారు. నర్సాపూర్ మండలంలోని రామచంద్రాపూర్, రుస్తుంపేట, మంతూరు, బ్రాహ్మణపల్లి, ఇబ్రహీంబాద్ గ్రామాలలో రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్తంగా వ్యవసాయేతర భూములను గుర్తింపు కోసం గురువారం సర్వే చేపట్టారు. సర్వేను ఆర్డీవో మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వ్యవసాయ భూముల్లో ఇండ్ల నిర్మాణాలు, వెంచర్లు, రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు, ఇతర అవసరాల కోసం వాణిజ్యపరంగా వాడుతున్న భూముల ను గుర్తిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దీపిక, ఆర్ఐ సిద్ధిరామిరెడ్డి అధికారులు పాల్గొన్నారు.
నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్
Comments
Please login to add a commentAdd a comment