ఇంటింటి సర్వే డబ్బులు చెల్లించండి
సీపీవోకు ఉపాధ్యాయుల వినతి
మెదక్ కలెక్టరేట్: ఇంటింటి సర్వే నిర్వహించిన డబ్బులు చెల్లించాలని పీఆర్టీయూటీఎస్ నాయకు లు కోరారు. ఈ మేరకు మెదక్ సమీకృత కలెక్టరేట్‌లోని సీపీవో కార్యాలయంలో గురువారం సీపీవో బద్రీనాథ్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇంటింటి సర్వేలో 1,852 మంది ఎన్యుమరేటర్లు, 200మంది సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. వారికి రూ.2.09 కోట్లు పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ–కుబేర్‌లో గవర్నమెంట్ పెండింగ్ అప్రూవల్ ఉందని, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్పందించిన సీపీవో నిధులు రాగానే ఎన్యుమరేటర్లకు, సూపర్‌వైజర్లకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment