అర్హులకు అన్యాయం జరగదు
చిన్నశంకరంపేట(మెదక్)/చేగుంట(తూప్రాన్): అర్హులు ఎవరూ ఆందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని భాగీర్తపల్లిలో ఇందిరమ్మ సర్వేను పరిశీలించి మాట్లాడారు. ఈనెల 22 నుంచి గ్రామ సభలలో పథకాల లబ్ధిదారుల పేర్లను ప్రకటించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి రైతుకు రైతు భరోస అందనుందన్నారు. భూమిలేని నిరుపేదలకు సైతం ఇందిరమ్మ అత్మీయ భరోసా అందించనున్నట్లు తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారీ విషయంలోనూ అపోహలు పెట్టుకోవద్దని, సమగ్ర కులగణన సర్వే ఆధారంగానే నూతన కార్డులు అందించనున్నట్లు చెప్పారు. ఈసందర్బంగా ఈఓ ప్రదీప్, ఎంపీడీఓ దామోదర్‌కు పలు సూచనలు చేశారు. అలాగే చేగుంట మండలంలోని ఉల్లి తిమ్మాయిపల్లిలో సర్వే తీరును పర్యవేక్షించారు.
అదనపు కలెక్టర్ నగేష్
Comments
Please login to add a commentAdd a comment