ఆగని బస్సులు.. తప్పని తిప్పలు
స్టేజీల వద్ద బస్సులు ఆగకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అల్లాదుర్గం, చిల్వెర ఐబీ చౌరస్తా నుంచి నిత్యం వందలాది మంది ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. మహలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించడంతో రద్దీ పెరిగింది. నారాయణఖేడ్, సంగారెడ్డి, హైదరాబాద్ డిపోలకు చెందిన బస్సులను పలు స్టేజీల వద్ద డ్రైవర్లు ఆపడం లేదు. అల్లాదుర్గం దాటిన తర్వాత సర్వీస్ రోడ్డు నుంచి వెళ్లాల్సి ఉండగా, 161 హైవే పైనుంచే వెళ్తున్నారు. ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – అల్లాదుర్గం(మెదక్)
Comments
Please login to add a commentAdd a comment