మల్లన్న క్షేత్రం.. బండారు మయం
● కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండాలు ● తరించిన భక్తకోటి
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న కేత్రం పసుపువర్ణ శోభితమైంది. పట్నం వారం సందర్భంగా సోమవారం తోటబావి ప్రాంగణంలో పెద్దపట్న ం, అగ్నిగుండాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పంచవర్ణాల పెద్ద పట్నాన్ని దాటుకుంటూ.. అగ్నిగుండంలో నడుస్తూ మేడలమ్మ, కేతమ్మ సమే త మల్లికార్జునుడిని దర్శించుకుని భక్తులు తన్మ యత్వం పొందారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హైదరాబాద్కు చెందిన మానుక పోచయ్య యాదవ్ కుటుంబ సభ్యులు, దుర్గాప్రసాద్యాదవ్, యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పెద్దపట్నం, అగ్నిగుండాలను నిర్వహించారు. శివసత్తులు, భక్తులు బండారు చల్లుకోవడంతో ఆలయ పరిసరాలు పసుపు మయమయ్యాయి.
21 వరుసలతో పెద్దపట్నం..
హైదరాబాద్ యాదవసంఘం ఒగ్గుపూజారులు పంచవర్ణాలతో 21 వరుసలతో పెద్దపట్నం వేశారు. అదే సమయంలో భగభగ మండే నిప్పు రవ్వలతో అగ్నిగుండం తయారు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment