రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
మెదక్‌జోన్: రేషన్ కార్డుల జారీ నిరంతర పక్రియ అని, అర్హులకు కార్డు మంజూరు కాకుంటే గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన క్షేత్రస్థాయి సర్వే పరిశీలన, గ్రామ, వార్డు సభల నిర్వహణపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం గుర్తింపులో ఎలాంటి తప్పిదాలకు తావివ్వొదని సూచించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర పథకాల విషయంలో అర్హులను గుర్తించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులపై ఉందని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్‌రెడ్డి, పాల్గొన్నారు.
ఆ భూములకు రైతు భరోసా వర్తించదు
టేక్మాల్(మెదక్): సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా వర్తించదని కలెక్టర్ స్పష్టం చేశారు. సోమవారం టేక్మాల్‌లో వివిధ పథకాల కోసం చేపడుతున్న సర్వేను పరిశీలించి మాట్లాడారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. గ్రామ సభల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీఓ విఠల్, వ్యవసాయాధికారి రాంప్రసాద్, ఆర్‌ఐ సాయి శ్రీకాంత్, ఈఓ రాకేష్ తదితరులు ఉన్నారు.
గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించాలి కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment