మా సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను వెంటనే కన్వర్షన్ చేయాలని టీవీఏసీజాక్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమ వారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు ప్రారంభించారు. ఈసందర్భంగా జాక్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేటి నుంచి ఈనెల 25 వరకు రిలే దీక్షలు, నిరసనలు తెలపనున్నట్లు తెలిపారు. ఏళ్ల తరబడి వెట్టి చాకిరి చేస్తున్నా.. పనికి తగిన వేతనం లభించడం లేదన్నారు. తాము కొత్తగా ఏమి అడగడం లేదని, ఉన్న పోస్టులను కన్వర్షన్ చేసి రెగ్యులర్ చేయాలన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక విద్యుత్‌శాఖలోనే రెండు రూల్స్ ఉండటం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు స్వామి, దుర్గేష్, నాగరాజు, కొండల్‌రెడ్డితో పాటు పెద్దసంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment