అడవుల సంరక్షణపై శిక్షణ
నర్సాపూర్: అడవుల సంరక్షణతో పాటు క్షేత్రస్థాయి పరిశోధనపై జిల్లాకు చెందిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి సోమవారం రైతు వేదికలో శిక్షణ ఏర్పాటుచేశారు. అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రకాష్, డీఎఫ్‌ఓ జోజి అడవుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అనంతరం అర్బన్ పా ర్కులో ఫీల్డ్ విజిట్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక ఎఫ్‌ఆర్‌ఓ అరవింద్, సెక్షన్ ఆఫీసర్ సాయిరాం పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోండి: జాన్ కెన్నడీ
నర్సాపూర్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఐకేపీ జిల్లా సంస్థాగత నిర్మాణ విభా గం ప్రాజెక్టు మేనేజర్ జాన్ కెన్నడీ హితవు పలికారు. సోమవారం ఐకేపీ కార్యాలయంలో గ్రామ సంఘాల అధ్యక్షులు, సీఏల శిక్షణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంఘాల నాయకత్వ మార్పులు, కాలపరిమితి, గ్రామ సంఘాలు, మండల సమాఖ్య బాధ్యుల విధు లు, బాధ్యతలు తదితర అంశాలపై ఆయన మహిళా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. సమావేశంలో ఐకేపీ ఏపీఎం గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సేవలో ముందుండాలి
మనోహరాబాద్(తూప్రాన్): ప్రజలకు సేవ చేయడంలో పరిశ్రమల యాజమాన్యాలు ముందుండాలని తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని రంగాయపల్లి, చెట్లగౌరారం శివారులో గల ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభి ంచి మాట్లాడారు. సీఎస్‌ఆర్ నిధులతో గ్రామాలకు చేయూతనివ్వాలి కోరారు. అనంతరం అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, పంచాయతీ కార్యదర్శి కవిత, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
బేటి బచావో– బేటి పడావో’పై అవగాహన కల్పించాలి
మెదక్ కలెక్టరేట్: ‘బేటి బచావో బేటి పడావో’ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని, పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సంబంధిత శాఖలతో సమన్వయం ఏర్పాటు చేసుకుని ఆడపిల్లల సంక్షేమానికి సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో తరచూ ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు చట్టపరమైన సంరక్షణ కల్పించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్షపై ప్రజలకు వివరిస్తూ బాలిక సాధికారత దిశగా జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, జిల్లా మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి హైమావతి, అదనపు ఎస్పీ మహేందర్, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ శ్రీరామ్, ిసీడీపీఓలు, సఖి, మహిళా సాధికారత సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment