వరం.. అమృత్ జలం
ఆదివారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2025
కేంద్రం అమలు చేస్తున్న అమృత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) పథకంతో నర్సాపూర్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుంది. మరో 20 ఏళ్ల వరకు రోజు వారి అవసరం మేర నీరు సరఫరా చేసే అవకాశం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా.. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది.
చెట్లు, గుట్టలకు ‘రైతుబంధు’
నర్సాపూర్:
మిషన్ భగీరథ పథకం అమలు చేస్తున్నప్పటికీ నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో పైపులైన్ వేయకపోవడంతో నల్లాల ద్వారా తాగు నీరు అందడం లేదు. పట్టణంలో మిషన్ భగీరథ పథకం కింద 18 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న 17 నీటి ట్యాంకులు ఉన్నాయి. కాగా పట్టణ జనాభా సుమా రు 25 లక్షల పైనే ఉంటుంది. ఒకరికి మున్సిపాలిటీ నుంచి రోజుకు 135 లీటర్ల నీరు సరఫరా చేయాల్సి ఉంటే రోజుకు 24 లక్షల లీటర్ల నీరు కావాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్యాంకుల కెపాసిటీ అంత మేరకు లేకపోవడంతో పలు ట్యాంకుల నుంచి డైరెక్ట్ పంపింగ్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే పైపులైన్ ఉన్న పలు ప్రాంతాల ప్రజలకు సరిపడా నీరు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక పట్టణంలోని పలు ప్రాంతాలకు భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయకపోవడంతో నీటి సరఫరా జరగడం లేదు. దీంతో ప్రజలు సొంత బోర్లపైనే ఆధారపడి అవసరాలు తీర్చుకుంటున్నారు.
మరో 20 ఏళ్ల వరకు సమస్య లేకుండా..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకం కింద నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ. 11 కోట్ల 90 లక్షలు మంజూరయ్యాయి. పట్టణంలో రాబోయే 20 ఏళ్ల వరకు నీటి సమస్య తలెత్తకుండా పథకం రూపొందించడంతో పాటు ప్రజలకు రోజు వారి అవసరం మేరకు నీటి సరఫరా చేసే లక్ష్యంతో పథకం అమలు చేయనున్నారు. అమృత్ పథకం కింద వచ్చిన నిధులతో 9వ వార్డులో ఏడున్నర లక్షల లీటర్ల కెపాసిటీ నీటి ట్యాంకుతో పాటు నాల్గవ వార్డులో ఆరున్నర లక్షల లీటర్ల కెపాసిటీ ట్యాంకు నిర్మించాలని నిర్ణయించారు. అంతేగాక మిషన్ భగీరథ పథకానికి సంబంధించి హన్మంతాపూర్ గుట్టపై ఉన్న జీఎల్‌బీఆర్ ట్యాంకు (గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నుంచి కొత్తగా నిర్మించనున్న రెండు నీటి ట్యాంకుల వరకు పైపులైను వేసి మిషన్ భగీరథ నీటితో నింపనున్నారు. కాగా పట్టణంలో పైపులైన్ లేని కాలనీలలో సైతం అమృత్ పథకం నిధులతో పైపులైన్ వేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న పైపులైన్ పాడైన చోట కొత్తగా పైపులైన్ వేయనున్నారు. కాగా అమృత్ 2.0 పథకం పనులు ఇప్పటికే టెండరు దశ పూర్తయి అగ్రిమెంట్ స్థాయిలో ఉన్నట్లు తెలిసింది. అగ్రిమెంట్ అయిన ఏడాది లోపు పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారుల ద్వారా తెలిసింది.
త్వరలోనే పనులకు శంకుస్థాపన
అమృత్ 2.0 పథకం కింద నర్సాపూర్ మున్సిపాలిటీకి వచ్చిన నిధులతో చేపట్టే పనులకు మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే సునీతారెడ్డి ఈనెల 19వ తేదీన శంకుస్థాపన చేయాల్సి ఉండగా, మంత్రి పర్యటన వాయిదా పడింది. కాగా త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది.
నర్సాపూర్‌లో మిషన్ భగీరథ నీటి ట్యాంకు
న్యూస్‌రీల్
అమృత్ 2.0 పథకంలో రూ. 11.90 కోట్ల నిధులు
ఇప్పటికే పూర్తయిన టెండర్ ప్రక్రియ
ఏడాదిలోపు పూర్తి కానున్న పనులు
నర్సాపూర్ మున్సిపాలిటీలోతాగు నీటికి శాశ్వత పరిష్కారం
శాశ్వత పరిష్కారం
అమృత్ పథకంతో పట్టణ ప్రజలకు రాబోయే 20 ఏళ్ల వరకు నీటిని అవసరం మేరకు సరఫరా చేసే విధంగా పథకం రూపొందించారు. పథకం వినియోగంలోకి వస్తే పట్టణంలోని అన్ని ప్రాంతాలకు సమంగా నీటి సరఫరా అవుతుంది. పట్టణంలో నీటి సమస్య లేకుండా పోతుంది.
– రామకృష్ణారావు, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment