● మల్లన్న క్షేత్రం.. భక్తజనసంద్రం
రాజగోపురం ఎదుట
భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): కోరమీసాల మల్లన్న స్వామి.. కోటి దండాలు..అంటూ భక్తులు ప్రణమిల్లారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో ఆదివారం కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి భక్తు లు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి. తెల్లవారుజామునుంచే భక్తులు తలనీలాలు సమర్పించి, పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు బోనాలతో డప్పుచప్పుళ్లతో ఆలయానికి చేరుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు డీసీపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment