విద్యాసరస్వతి సన్నిధిలో భారీగా అక్షర స్వీకారాలు
వర్గల్‌కు ‘వసంత’ శోభ
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం వసంత శోభను సంతరించుకుంది. ఆదివారం వారాంతపు సెలవు కావడం, పంచమి తిథి కలిసిరావడంతో భక్తులు పోటెత్తారు. వసంతపంచమి మహోత్సవం ముందురోజే అక్షరదేవత సన్నిధానం భక్తులతో నిండిపోయింది. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం వసంత పంచమి మహోత్సవ వేడుకలు తెల్లవారుజాము నుంచే మొదలవుతాయని ఆలయవ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి తెలిపారు. చిన్నారుల అక్షరాభ్యాసాలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment