ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం
మెదక్‌జోన్: తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తపస్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 317 జీవో, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్, యూనియన్ నేతలు రామారావు, దుబాషి భాస్కర్, దేశ్ భాస్కర్, మెదక్ జిల్లా తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్లం, చల్లా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
తపస్ అభ్యర్థి కొమురయ్య
Comments
Please login to add a commentAdd a comment