ఎమ్మెల్సీ ఓటర్లు 71,622 నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ.. | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటర్లు 71,622 నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ..

Published Wed, Feb 5 2025 6:52 AM | Last Updated on Wed, Feb 5 2025 6:52 AM

ఎమ్మెల్సీ ఓటర్లు 71,622 నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షుర

ఎమ్మెల్సీ ఓటర్లు 71,622 నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షుర

ఇదీ షెడ్యూల్‌

నెల 3న ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల కాగా, అదేరోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించింది. 11న నామినేషన్‌ పత్రాలు పరిశీలన, 13వ తేదీ వరకు వాటి ఉపసంహరణకు గడువు విధించింది. ఉపసంహరణ అనంతరం పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈనెల 27న ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనుంది.

సంగారెడ్డి జోన్‌: ఉమ్మడి మెదక్‌–కరీంనగర్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాలతో కూడిన పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఇందుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసేందుకు ఓటరు జాబితాతో పాటు పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, గతేడాది డిసెంబర్‌ 30న తుది జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

మార్చి 8 వరకు కోడ్‌

మండలి ఎన్నికల కోడ్‌ అమలు మార్చి 8 వరకు అమలు చేయనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోడ్‌ ముగిసే వరకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నియమ నిబ ంధనల మేరకే ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు కొనసాగే జిల్లాల్లో కోడ్‌ అమల్లో ఉండటంతో కొత్త పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు అవకాశం లేదని ఎన్నికల సంఘం ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.

ఎన్నికల నిర్వహణకు కసరత్తు

ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్‌, ప్రతీ జిల్లాలో ఆర్డీవోలు అసిస్టెంట్‌ ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు. సంగారెడ్డి జిల్లాలో నలుగురు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఉన్నారు. అదేవిధంగా మండలాల వారీగా అధికారులను కేటాయించే పని కొనసాగుతోంది.

కరీంనగర్‌లో నామినేషన్‌ దాఖలు

పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు కరీంనగర్‌లోని కలెక్టర్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు.

174 పోలింగ్‌ స్టేషన్లు

తేడాది డిసెంబర్‌ 30న విడుదల చేసిన తుది ఓటరు జాబితాలో ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా 71,622 మంది ఉపాధ్యాయ పట్టభద్రుల ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా 174 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంవత్సరం జనవరి 1 నుంచి 31 వరకు ఓటు వేసేందుకు మరో అవకాశం కల్పించారు. దీంతో దరఖాస్తు చేసుకున్న వారితో మరింతగా ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ఓటర్ల సంఖ్యతోపాటు ఓటర్ల జాబితా ను ఈనెల 7న ప్రకటించనున్నారు.

ఉపాధ్యాయుల ఓటర్లు, పోలింగ్‌స్టేషన్లు

జిల్లా సీ్త్రలు పురుషులు మొత్తం పోలింగ్‌ స్టేషన్లు

సంగారెడ్డి 1,103 1,485 2,588 28

మెదక్‌ 515 766 1,281 21

సిద్దిపేట 1,104 1,948 3,052 23

పట్టభద్రుల ఓటర్లు, పోలింగ్‌స్టేషన్లు

జిల్లా సీ్త్రలు పురుషులు మొత్తం పోలింగ్‌ స్టేషన్లు

సంగారెడ్డి 6,765 14,437 21,202 40

మెదక్‌ 3,420 8,533 11,953 22

సిద్దిపేట 10,624 20,922 31,546 40

మార్చి 8 వరకు కోడ్‌ అమలు

పెరగనున్న ఓటర్ల సంఖ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement