వన్యప్రాణులకు రక్షణేది!
అటవీదారుల్లో అండర్‌పాస్‌లు లేకనే ప్రమాదాలు
మెదక్‌జోన్: అటవీ ప్రాంతంలో నిర్మించిన రహదారుల వద్ద అండర్‌పాస్‌లు నిర్మించకపోవడంతో వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడి దుర్మరణం పాలవుతున్నాయి. వాస్తవానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం (వైల్డ్ లైఫ్ యాక్ట్) ప్రకారం అండర్‌పాస్‌లు నిర్మించాలి. కానీ, వాటిని నిర్మించకపోవటంతో ప్రతి ఏటా జంతువులు రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నాయి. ఇటీవలే ఇలా అండర్‌పాస్ లేక దాహం తీర్చుకునేందుకు వెళ్లిన ఓ చిరుతపులి ఇబ్రహీంపట్నం అటవీప్రాంతం సమీపంలో ప్రమాదానికి గురై మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఏటా పదుల సంఖ్యలో మృతి
అడవి జంతువులు వేసవిలో దాహం తీర్చుకునేందుకు చెక్‌డ్యామ్‌లను, సాసర్‌ఫీట్లను వెతుక్కుంటూ వెళ్తాయి. ఇలా ప్రతీ ఏటా రోడ్డు దాటే క్రమంలో పదుల సంఖ్యలో వన్యప్రాణులు ప్రమాదాలకు గురై చనిపోతున్నాయి. మెదక్ నుంచి బోదన్ వెళ్లే దారిలో బూర్గుపల్లి, గాజిరెడ్డిపల్లి, బూపతిపూర్ గ్రామాల సమీపంలో అదేవిధంగా హైదరాబాద్ వయా బాలనగర్ హైవేలో సైతం నర్సాపూర్ అడవి దట్టంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 57 వేల హెక్టార్లలో విస్తరించిన అడవిలో 10 చిరుతలు సంచరిస్తునట్లు అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు జింకలు, కొండగొర్లు, నీల్గాయిలు, అడవికుక్కలు, నక్కలు, పందులు అనేక రకాల జంతువులున్నాయి. వీటి సంరక్షణకు అటవీ అధికారులు చర్యలు చేపట్టాలని జంతుప్రేమికులు కోరుతున్నారు.
ఇటీవల ‘చిరుత’మరణానికి ఇదే కారణం చర్యలు చేపట్టాలంటున్న జంతు ప్రేమికులు
అండర్ పాస్‌లు నిర్మించాలని లేఖ
అడవి మధ్యలో నుంచి నిర్మించిన రహదారుల్లో అండర్‌పాస్‌లు నిర్మించాలని హైవే రోడ్డు అథారిటీ అధికారులకు లేఖలు రాశాం. ఇటీవల ఇబ్రహీంపూర్ అటవీప్రాంతంలో హైవేపై చిరుత మరణానికి కారణం అండర్ పాస్ లేకపోవటమే.
– జోజి, డీఎఫ్‌వో, మెదక్
Comments
Please login to add a commentAdd a comment