![దుర్గ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04mdk77-350085_mr-1738718463-0.jpg.webp?itok=PJ2JQfWH)
దుర్గమ్మసేవలో ఇబ్రహీంపట్నం న్యాయమూర్తి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల దుర్గమ్మను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏడవ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రీటాలాల్ చంద్ దంపతులు మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజ లు చేశారు. అర్చకులు అమ్మవారికి కుంకుమ అర్చన, అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం న్యాయమూర్తి దంపతులను ఆలయ అధికారులు సత్కరించారు.
రిజర్వేషన్లు తేల్చాకేఎన్నికలు నిర్వహించండి
శివ్వంపేట(నర్సాపూర్): బీసీల రిజర్వేషన్లు తేల్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి హరికృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బీసీల జనాభా అధికంగా ఉన్నా అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. బీసీలకు సంబంధించి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన సీఎం.. అసెంబ్లీ సాక్షిగా చేతులు ఎత్తేసినట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గితే స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు.
కృత్రిమ గర్భధారణతోమేలుజాతి పశువులు
జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య
కౌడిపల్లి(నర్సాపూర్): కృత్రిమ గర్భధారణతో మేలుజాతి పశువులు పుడుతాయని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య తెలిపారు. మంగళవారం మండలంలోని ధర్మాసాగర్‌లో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడిరైతులు అధిక పాల కోసం మేలుజాతి పశువులను తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఆడదూడలు పుట్టేందుకు లింగనిర్ధారణ వీర్యం అందుబాటులో ఉందని, రూ.800కు గాను ప్రభుత్వం రూ.250 సబ్సిడీ ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా గర్భకోశ వ్యాధుల నివారణ, నట్టల నివారణకు చికిత్సలు చేసి మందులు పంపిణీ చేశారు. పాడిపశువుల ఆరోగ్యం కోసం మినరల్ మిక్చర్ వాడాలని తెలిపారు. అధిక పాలదిగుబడి సాధించిన రైతులకు పాలబకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఫర్హీన్‌ఫాతిమా, డాక్టర్ సౌమిత్‌కుమార్, డాక్టర్ ప్రియాంక, జేవీఓ సుదర్శన్, వీరారెడ్డి, చెన్నయ్య, గోపాలమిత్రల సూపర్‌వైజర్ సత్యనారాయణ, నెల్లూర్, విఠల్, లక్ష్మినర్సయ్య, కవిత పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు
కలిగించవద్దు
డీలర్లకు ఏడీఏ పుణ్యవతి సూచన
కౌడిపల్లి(నర్సాపూర్): ఎరువుల డీలర్లు రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని ఏడీఏ పుణ్య వతి అన్నారు. మంగళవారం కౌడిపల్లిలోని ఏడీఏ కార్యాలయంలో ఎరువుల డీలర్లతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక ధరలకు ఎరువులు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజన్‌కు అనుగుణంగా ముందుగానే స్టాక్ తెచ్చుకోవాలన్నారు. అనవసరమైన మందులు అంటగట్టి రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. స్టాక్‌బోర్డు, ధరల పట్టిక రైతులకు కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కొనుగోలు, అమ్మకానికి బిల్లు ఇవ్వాలని చెప్పారు. స్టాక్ రికార్డులు నమోదు చేయాలని తెలిపారు. నిర్లక్షం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న, డీలర్లు పాల్గొన్నారు.
![దుర్గమ్మసేవలో ఇబ్రహీంపట్నం న్యాయమూర్తి 1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04nrs52-350044_mr-1738718463-1.jpg)
దుర్గమ్మసేవలో ఇబ్రహీంపట్నం న్యాయమూర్తి
Comments
Please login to add a commentAdd a comment