కష్టపడి చదివితేనే భవిష్యత్
హవేళిఘణాపూర్(మెదక్): కష్టపడి చదివి ఉత్తమ ప్రతిభ కనబరచాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మంగళవారం రాత్రి మండల పరిధిలోని బూర్గుపల్లి బాలుర వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. వసతులు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. అక్కడే బస చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. లక్ష్యాలను ఎంచుకొని ముందుకు వెళ్లాలని, అప్పుడే గమ్యాన్ని ముద్దాడ వచ్చని పేర్కొన్నారు. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని ఆయన ఉద్బోధించారు. ఈసారి హాస్టల్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కార్యాచరణతో ముందుకెళ్లాలని, అప్పుడే ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
ఓటరు జాబితాపై అవగాహన
మెదక్‌జోన్: గ్రామపంచాయతీ, వార్డుల వారీగా ఓటరు జాబితాపై వివిధ రాజకీయ పార్టీల నేతలకు మంగళవారం కలెక్టరేట్‌లో అవగాహన కల్పించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. ఓటరు జాబితా, బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సులు పోలింగ్ నిర్వహణకు కావాల్సిన మెటీరియల్ సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 493 గ్రామపంచాయతీలు ఉండగా 5,25,478 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఇందులో పురుషులు 2,52,797 ఉండగా, మహిళా ఓటర్లు 2,72,672 ఉన్నారన్నారు. 9 మంది ఇతరులు ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో డీపీఓ యాదయ్యతో పాటు సీపీఎం, సీపీఐ, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పాల్గొన్నారు
అదనపు జిల్లా కలెక్టర్ నగేశ్
బూర్గుపల్లి హాస్టల్ ఆకస్మిక తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment