ఏడుపాయలలో భక్తుల సందడి
పాపన్నపేట(మెదక్): ఎల్లలు దాటివచ్చిన భక్తులతో ఏడుపాయల జనారణ్యంగా మారింది. ఆదివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, రాష్ట్ర ట్రైబర్ వెల్ఫేర్ కార్యదర్శి డాక్టర్ శరత్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అందుకనుగుణంగా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, ఈఓ చంద్రశేఖర్, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment