అమలు కాని హామీలతో మోసం
కౌడిపల్లి(నర్సాపూర్): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిందని.. చిత్తశుద్ధి ఉంటే అన్ని పథకాలు అమలు చేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఆదివారం మండలంలోని తిమ్మాపూర్‌లో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలకు ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పిందన్నారు. 420 రోజులు అయిన రుణమాఫీ కాలే, రైతుబంధు రాలేదన్నారు. గౌడ కులస్తులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతూ కేసులు పెట్టిస్తుందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు అడగకుండానే సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సార రామాగౌడ్, మాజీ ఎంపీటీసీలు శంకర్‌గౌడ్, కిషోర్‌గౌడ్, నాయకులు మన్సూ ర్, చంద్రాగౌడ్ త దితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment