Bigg Boss Telugu Season 6 Promo Out Now - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో ‘బిగ్‌బాస్‌’ ప్రోమో.. అదిరింది

Published Tue, Aug 9 2022 11:53 AM | Last Updated on Thu, Sep 1 2022 1:57 PM

Bigg Boss 6 Telugu Promo Out - Sakshi

బుల్లితెరపై సందడి చేసేందుకు ‘బిగ్‌బాస్‌’ వచ్చేస్తున్నారు. త్వరలోనే బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ విషయానే అధికారికంగా తెలియజేస్తూ తాజాగా ప్రోమో విడుదల చేశారు మేకర్స్‌. అప్పగింతలప్పుడు నవవధువు కంటతడి పెట్టుకోవడంతో ప్రోమో మొదలవుతుంది. మా ఇంటి మహాలక్ష్మిని పంపించడం నా వల్ల కావట్లేదమ్మా అంటూ తల్లిదండ్రులు ఎమోషనల్‌ అవ్వడం.. వారిని పెళ్లి కూతురు ఓదారుస్తున్న సమయంలో ఒక్కసారిగా అదృశ్యమవుతారు. వారు ఏమయ్యారోనని పెళ్లి కూతురు అన్వేషిస్తున్న సమయంలో నాగార్జున ఎంట్రీ ఇచ్చి.. ‘అప్పగింతలు అయ్యే వరకు కూడా ఆగలేకపోయారంటే..అక్కడ ఆట మొదలైనట్టే’అని బిగ్‌బాస్‌ షో గురించి చెబుతాడు.

(చదవండి: ఆదిరెడ్డి, అమర్‌దీప్‌.. బిగ్‌బాస్‌ 6లో ఇంకా ఎవరెవరంటే?)

‘లైఫ్‌లో ఏ మూమెంట్‌ అయినా బిగ్‌బాస్‌ తర్వాతే’. బిగ్‌బాస్‌ సీజన్‌ సిక్స్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌’అంటూ నాగ్‌ చెప్పే సంభాషణలతో ఈ ప్రోమో ముగుస్తుంది. గత మూడు సీజన్స్‌(3,4,5)తో పాటు బిగ్‌బాస్‌ ఓటీటీకి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున..ఆరో సీజన్‌కి కూడా హోస్టింగ్‌ చేయబోతున్నాడు.  ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్‌ ఘనంగా లాంచ్‌ కానుంది. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సారి ఎక్కువగా సినిమా రంగానికి చెందిన వారినే షోకి తీసుకురాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నారు.  స్టార్‌ మాతో పాటు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లోనూ ఈ షో స్ట్రీమింగ్‌ కానుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement