యాంకర్‌కి దిమ్మ తిరిగిపోయే ఆన్సర్లిచ్చిన సుదీప | Bigg Boss 6 Telugu: Sudeepa Counters To Anchor Shiva | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: దాన్ని ఫేవరెటిజం అంటారా?: యాంకర్‌కు పింకీ కౌంటర్‌

Published Mon, Oct 17 2022 5:08 PM | Last Updated on Mon, Oct 17 2022 5:14 PM

Bigg Boss 6 Telugu: Sudeepa Counters To Anchor Shiva - Sakshi

బిగ్‌బాస్‌ 6 తెలుగు షో నుంచి తాజాగా బయటకు వచ్చేసింది సుదీప. ఎలాంటి గొడవ వచ్చినా మాటలతో నెగ్గుకు వచ్చే ఈ పింకీ తాజాగా బిగ్‌బాస్‌ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్‌ శివ సుదీపకు వరుస ప్రశ్నలు విసిరాడు. కిచెన్‌లో ఉంటే అందరికీ మంచి అభిప్రాయం వస్తుందని వంటగదిలో సెటిలైపోయారా? అని అడిగాడు. అందుకామె అలాంటి ఆలోచనే తనకు లేదని చెప్పింది. ఎవరూ నాకు వంటరాదంటే నాకు రాదని చేతులెత్తేయడంతో అక్కడ ఉన్నానంది. ఇంట్లో అనవసరంగా గొడవలు పడే వ్యక్తి రేవంత్‌ అని ముక్కుసూటిగా చెప్పేసింది.

హౌస్‌లో ఫేవరెటిజం చూపించారట? అన్న ప్రశ్నకు సుదీప స్పందిస్తూ.. ఎవరైనా డల్‌గా ఉంటే వెళ్లి పలకరించేదాన్ని, ఎవరినైనా టార్గెట్‌ చేస్తున్నారంటే వాళ్ల వెనకాల నిలబడేదాన్ని.. దీన్ని ఫేవరెటిజం అనుకుంటే నేనేం చేయలేను అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా హౌస్‌లోనే కాదు, బయట కూడా సుదీప తన వాక్చాతుర్యంతో ఎదుటివారు తనకు కౌంటర్‌ ఇచ్చేందుకు ఛాన్స్‌ ఇవ్వదని ఈ బజ్‌తో మరోసారి రుజువైంది.

చదవండి: ఏడోవారం నామినేషన్‌లో ఎవరెవరున్నారంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement