మాయా లేదు.. మంత్రం లేదు.. మీకు నచ్చినవారితో మీరు మెచ్చేవారితో మిమ్మల్ని నవ్విస్తాం.. కావాల్సినదానికంటే ఎక్కువ వినోదాన్ని పంచుతాం.. అంటూ బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మన ముందుకు వచ్చేస్తోంది. మొన్నటిదాకా కంటెస్టెంట్లు వీళ్లే, వాళ్లేనంటూ ఎంతోమంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. షో ప్రారంభమయ్యేది కూడా సెప్టెంబర్ 1 లేదా 8 అంటూ ఊహాగానాలు వినిపించాయి.
అధికారిక ప్రకటన
ఎట్టకేలకు షో లాంఛింగ్ డేట్ వదిలారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు అన్న డైలాగ్‌తో వీడియో వచ్చేసింది. సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి పండగ ఉంది. ఈ పండగ కంటే ముందే బిగ్‌బాస్ వీక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది.
రెడీ అంటున్న బిగ్‌బాస్ ఫ్యాన్స్
దీంతో బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈసారి ఇంట్లో ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏదైతేనేం.. కంటెస్టెంట్లు కొట్టుకు చచ్చినా పర్లేదు కానీ మమ్మల్ని మాత్రం ఎంటర్‌టైన్ చేయండి అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment