‘పెళ్లి కల వచ్చేసిందే కాజల్‌..’ | Bride To Be Kajal Aggarwal In Some Happy Pics With Sister Nisha | Sakshi
Sakshi News home page

కాజల్ కొత్త ప్రయాణం..

Published Wed, Oct 7 2020 6:21 AM | Last Updated on Wed, Oct 7 2020 6:21 AM

Bride To Be Kajal Aggarwal In Some Happy Pics With Sister Nisha - Sakshi

​​​​​​​బ్యాచిలరెట్‌ పార్టీలో కాజల్‌ అగర్వాల్‌

‘పెళ్లి కల వచ్చేసిందే కాజల్‌..’ అంటూ కాజల్‌ అగర్వాల్‌ అభిమానులు సంబరపడిపోతున్నారు. దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌లలో ఒకరైన కాజల్‌ని ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడిగితే, ‘పెళ్లి కుదిరినప్పుడు స్వయంగా నేనే చెబుతా’ అని చెప్పేవారు. తాజాగా తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారీ బ్యూటీ. గౌతమ్‌ కిచ్లు అనే ఇంటీరియర్‌ డిజైనర్, వ్యాపారవేత్తను ఆమె మనువాడనున్నారు. ‘‘గౌతమ్‌ కిచ్లుని ఈ నెల 30న పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాననే వార్తను మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ముంబైలో సింపుల్‌గా జరిగే మా పెళ్లి వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొంటారు.

మేమిద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుండటం సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదాలు మాపై ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నా. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. పెళ్లి తర్వాత కూడా నాకు ఎంతో ఇష్టమైన నటనని కొనసాగిస్తూ మిమ్మల్ని ఇంకా అలరిస్తూనే ఉంటాను’’ అని కాజల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఆ మధ్య కాజల్, గౌతమ్‌ల నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత బ్యాచిలరెట్‌ పార్టీ (పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇచ్చే పార్టీ) జరిగిందని తెలుస్తోంది. ఈ పార్టీలో చెల్లెలు నిషా అగర్వాల్‌తో కలసి కాజల్‌ బాగా సందడి చేసినట్లు ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. 

కాజల్‌ అగర్వాల్, నిషా అగర్వాల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement