పెళ్లి పనులు... కొత్త ఇల్లు | Kajal Aggarwal and Gautam Kitchlu do up their new house | Sakshi
Sakshi News home page

పెళ్లి పనులు... కొత్త ఇల్లు

Published Fri, Oct 23 2020 12:08 AM | Last Updated on Fri, Oct 23 2020 12:25 AM

Kajal Aggarwal and Gautam Kitchlu do up their new house - Sakshi

కాజల్‌ అగర్వాల్‌

దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌లలో ఒకరిగా దూసుకెళుతున్న కాజల్‌ అగర్వాల్‌ ఈ నెల 30న పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. గౌతమ్‌ కిచ్లుతో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ముంబయిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. వివాహ వేడుకలు ముగియగానే కొత్త ఇంట్లోకి మారనున్నారట కాజల్, గౌతమ్‌.

ప్రస్తుతం ఇంటికి సంబంధించిన ఇంటీరియర్‌ వర్క్స్‌ని తమ అభిరుచికి తగ్గట్టు చేయిస్తున్నారట ఈ కాబోయే దంపతులు. ఓ వైపు పెళ్లి పనుల్లో కాజల్‌–గౌతమ్‌ బిజీగా ఉంటూనే మరోవైపు ఇంటి పనులపైనా దృష్టి పెట్టారు. పైగా గౌతమ్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ బిజినెస్‌లో ఉండటంతో తమ సొంత ఇంటిని ప్రత్యేకంగా డిజైన్‌ చేయిస్తున్నారట. ఈ విషయాన్ని తన ఇ¯Œ స్టాగ్రామ్‌ ద్వారా కాజల్‌ వెల్లడించి, ‘మా కొత్త ఇంట్లో ఇంటీరియర్‌ పనులు జరుగుతున్నాయి. ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారా?’ అని పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement