ముంబై: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించిన విశేషాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా అభిమాన నటీనటుల ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై ఆరాలు తీస్తారు ఫ్యాన్స్. యాక్టర్లు సైతం ఈ విషయాల గురించి అప్పుడప్పుడు లీకులు ఇస్తూ వార్తల్లో నానుతూ ఉంటారు. సోషల్ మీడియా, బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోలను ఇందుకు వేదిక చేసుకుంటారు. నటి దేవొలీనా భట్టాచార్య తాజాగా తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ కుండబద్దలు కొట్టారు.అతడితో తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. హిందీ హిట్ సీరియల్ ‘సాథ్ నిభానా సాథియా’(కోడలా కోడలా కొడుకు పెళ్లామా)లో గోపికగా బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందిన ఆమె గత బిగ్‌బాస్ సీజన్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే.(చదవండి: ‘ముందే తెలిస్తే ఆ దెయ్యం నుంచి కాపాడేవాడిని’)
అయితే అనారోగ్య సమస్యల కారణంగా మధ్యలోనే హౌజ్ వీడిన దేవొలినా, బిగ్‌బాస్ 14లో ఇజాజ్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేస్తూ.. ‘ఛాలెంజర్’గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో తోటి కంటెస్టెంట్ రాఖీ సావంత్ దేవొలినా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. హౌజ్‌మేట్ రాహుల్ వైద్య అంటే నీకు ఇష్టమేనా అని ప్రశ్నించగా.. తాను వేరొక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు దేవొలినా స్పష్టం చేశారు. అయితే అతడికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ విషయంపై స్పందించిన దేవొలినా తల్లి అనీమా భట్టాచార్య, తన కూతురి మాటలు ఆశ్చర్యపరిచాయని, ఒకవేళ అవి నిజమే అయితే ముంబై వెళ్లి కాబోయే అల్లుడిని కలుస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఈ సీజన్‌లో తన కూతురు ఎంతో బాగా ఆడుతోందని, తన గేమ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు అనీమా పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ 14 సీజన్‌కు సైతం హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment