'కల్కి' కాపీ సినిమా కాదు.. క్లారిటీ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌ | Sakshi
Sakshi News home page

'కల్కి' కాపీ సినిమా కాదు.. క్లారిటీ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌

Published Tue, Apr 30 2024 10:28 AM

Kalki 2898 AD Not Inspired By This Bollywood Movie

ప్రభాస్‌ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి నిత్యం ఏదొ ఒక వైరల్‌ న్యూస్‌ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు.  ఈ సినిమా జూన్‌ 27న విడుదలవుతుందని తాజాగా ప్రకటన కూడా వచ్చేసింది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూసిన ప్రేక్షకులు పలు కామెంట్లు చేస్తున్నారు. హాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన 'డ్యూన్‌'ను కాపీ కొట్టారంటూ నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతుంది. ఇదే విషయంపై కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న నాగ్‌అశ్విన్‌.. కల్కిని కొందరు హాలీవుడ్‌ సినిమా డ్యూన్‌తో పోలుస్తున్నారు.. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. బహుశా అలా పోల్చే వారందరూ కూడా సినిమాలో ఉన్న ఇసుకను చూసి అలా భావించి ఉంటారని ఆయన అన్నారు. ఇప్పటికే చాలాసార్లు 'కల్కి' చిత్రాన్ని ఇలా వేరే హాలీవుడ్‌ చిత్రాలతో పోల్చారని ఆయన తెలిపారు. ఇందులో ఏ సినిమా రెఫరెన్స్‌లు లేవు. సినిమా విడుదల తర్వాత ఆ విషయంపై అందరికీ క్లారిటీ వస్తుంది. ఈ మూవీ జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement