Manchu Manoj Expressed His Condolences To Ajith Kumar's Father P Subramaniam Mani Demise - Sakshi
Sakshi News home page

Manchu Manoj: విష్ణుతో ఫైట్‌.. మనోజ్‌ ట్వీట్‌ వైరల్‌.. మళ్లీ కలవండి అన్నా అంటూ..

Published Sat, Mar 25 2023 9:12 AM | Last Updated on Sat, Mar 25 2023 9:52 AM

Manchu Manoj Tweet After Clashes with Vishnu - Sakshi

మంచు మనోజ్‌, విష్ణుల మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో విష్ణు తన మనుషులను కొడుతున్నాడంటూ మనోజ్‌ వీడియో షేర్‌ చేయడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. తన అనుచరుడిపై దాడి చేశాడంటూ అందుకు సంబంధించిన దృశ్యాలను మనోజ్‌ సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేయడం, తండ్రి మోహన్‌బాబు ఆగ్రహించడంతో వెంటనే ఆ వీడియోను డిలీట్‌ చేయడం చకచకా జరిగిపోయాయి. దీనిపై విష్ణు కూడా స్పందిస్తూ అన్నదమ్ముల మధ్య గొడవలు సాధారణమేనని, ఇది చిన్న విషయమేనని, ఏదో ఆవేశంలో వీడియో పోస్ట్‌ చేశాడని క్లారిటీ ఇచ్చాడు.

ఈ వివాదం కొంత సద్దుమణిగిన తర్వాత మనోజ్‌ సోషల్‌ మీడియాలో ఓ విషాదంపై స్పందిస్తూ ట్వీట్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. స్టార్‌ హీరో అజిత్‌ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే! ఆయన మృతికి మనోజ్‌ సంతాపం ప్రకటించాడు. 'మణిగారి మరణవార్త విని బాధేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అజిత్‌ కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌ కింద అభిమానులు మాత్రం.. మీ అన్నదమ్ముల మధ్య ఏం జరిగింది? గొడవ సద్దుమణిగిందా? లేదా?, ఇది ప్రాంక్‌ వీడియో అయితే కాదు కదా, ఒకవేళ గొడవపడినా మళ్లీ కలవండి అన్నా.. అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

కాగా మనోజ్‌ ఇటీవలే భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు వాట్‌ ది ఫిష్‌ సినిమా చేస్తున్నాడు. వరుణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మనం మనం బరంపురం అనే ట్యాగ్‌లైన్‌ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement