![Mutyala Muggu Actor P Venkateswara Rao Died - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/10/Mutyala-Muggu-Actor-P-Venkateswara-Rao.jpg.webp?itok=C94Y9vLW)
రంగస్థలం కళాకారుడు, నటుడు పి. వెంకటేశ్వర రావు(90) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య లక్ష్మీ, ఏడుగురు పిల్లలు ఉన్నారు. పి.వెంకటేశ్వర రావు పూర్తిపేరు పిసుపాటి వేంకటేశ్వర రావు. తొలుత రంగస్థలం కళాకరుడిగా పరిచయం అయిన ఆయన తేనె మనసులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు.
ఆ తర్వాత కన్నెమనసులు, ఆత్మీయులు, మరోప్రపంచం, సుడిగుండాలు, మట్టిలో మాణిక్యం, ముత్యాలముగ్గు వంటి అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. గతంలో ఇదేమిటి అనే నాటకంలో నటించి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment