27 సంవత్సరాల తర్వాత తిరిగి నటిస్తున్న డైరెక్టర్‌ | Nagali Movie: Bharath Parepalli Acts After 27 Years | Sakshi
Sakshi News home page

Bharath Parepalli: 27 సంవత్సరాల తర్వాత తిరిగి నటిస్తున్న డైరెక్టర్‌

Published Mon, Nov 28 2022 4:55 PM | Last Updated on Mon, Nov 28 2022 7:21 PM

Nagali Movie: Bharath Parepalli Acts After 27 Years - Sakshi

ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి 27 సంవత్సరాల తర్వాత తిరిగి నటిస్తున్నాడు. 1995లో `తపస్సు` సినిమాలో నటించిన ఆయన తాజాగా నాగలి సినిమాలో రైతుగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు  భరత్ పారేపల్లి మాట్లాడుతూ...``రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నూతన నటీనటులతో చిత్రీకరణ జరిపాము. సుదీప్ మొక్కరాల నిడదవోలు, అనుస్మతి సర్కార్ ముంబాయి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఎంఎల్ రాజా సంగీత సమర్పణలో జరిగాయి.

రైతుల ఆత్మహత్యలు.. వాళ్ళ  కథలు, వెతలు  కలయబోసిన 1857, 58ల మధ్య జరిగిన సిపాయిల తిరుగుబాటును తలపించేలా ఇప్పుడు రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంతో  ఈ సినిమా చేసాము. ఇందులో ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తూ నిర్మించాను' అని భరత్‌ పారేపల్లి తెలిపారు. భరత్ పారేపల్లి, సత్య ప్రసాద్ రొంగల, మోహన్ రావు వల్లూరి, కావేరి, మధు బాయ్, వాసు వర్మ, నాని తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి  కో డైరెక్టర్ - నాని జంగాల, సినిమాటోగ్రఫీ - వాసు వర్మ కఠారి,  నిర్మాతలు - భరత్ పారేపల్లి , సుదీప్ మొక్కరాల.

చదవండి: నా పనిమనిషి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు, ఇప్పుడేకంగా: నటి
ప్రభాస్‌- కృతీసన్‌ డేటింగ్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement