టాలీవుడ్ విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళిది ప్రత్యేకస్థానం. కమెడియన్‌గా, నటుడిగా, దర్శకనిర్మాతగా, రచయితగా సత్తా చాటిన ఆయన తాజా ఇంటర్వ్యూలో తన బాధలు చెప్తూ కంటతడి పెట్టుకున్నారు. 'నేను బాగా చదువుకున్నాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుదామనుకున్నాను. మంచి ఉద్యోగం వచ్చేలా ఉందని నాకు అనేక పెళ్లిసంబంధాలు వచ్చాయి. కానీ నా క్యారెక్టర్ మీద నిందలు వేస్తూ వాటిని చెడగొట్టారు. పెళ్లిచూపులైన సంబంధాన్ని కూడా క్యాన్సిల్ అయ్యేలా చేశారు. నాకూ మనసుంటుంది. ఓ అమ్మాయి తోడు కావాలని ఉంటుంది. కానీ లవ్వూ పోయింది, లవ్లీ లైఫూ పోయింది. పెళ్లి సంబంధాలు చెడగొట్టేవాళ్లు ఎవరో తెలిసినా కూడా ఏమీ చేయలేకపోయేవాడిని. ఒకానొక దశలో సహనం నశించి పుస్తకాల్లో కత్తి పట్టుకుని తిరిగాను.
ఇదిలా ఉంటే మాది సగం కూలిన డాభా. డబ్బుల్లేక బాగు చేయించలేదు. నాన్న ఎంతో మంచివాడు. కానీ పేకాట వల్ల ఓరోజు పురుగుల మందు తాగి చనిపోయాడు. సాధారణంగా నాకు ఏడుపు రాదు, కానీ ఈరోజు కన్నీళ్లు నాకు తెలియకుండానే వచ్చేస్తున్నాయి. మా అమ్మకు బంగారు గాజులు, నాన్నకు బంగారు ఉంగరం, ఓ కారు కొనివ్వాలని కలలు కన్నాను. కానీ అవేమీ నెరవేరకుండానే ఇద్దరూ చనిపోయారు' అంటూ ఏడ్చారు పోసాని కృష్ణ మురళి.
చదవండి: ఫిలిం ఛాంబర్‌లో మతిస్థిమితం లేని వ్యక్తి, బాలయ్యకు వేలెత్తి చూపుతూ
Comments
Please login to add a commentAdd a comment