Ram Gopal Varma About His Political Entry: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలితో తరచూ షాకిస్తుంటాడు. ఆయన వ్యాఖ్యలు, అభిప్రాయలు చాలా అందరి కంటే భిన్నంగా ఉంటాయి. అందుకే ఆయన ఏం మాట్లాడిన అది చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ తనపై తాను ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకున్నాడు. తాను ఎప్పుడు ఒకేలా ఉండనని, తన ప్రతి సినిమా సమయంలో చనిపోయి మళ్లీ పుడతానని చెబుతుంటాడు. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆయన తన పొలిటికల్ ఎంట్రీ, ప్రస్తుతం సినిమాలపై స్పందించాడు.
చదవండి: కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ సంచలన ఆరోపణలు
ఈ మేరకు వర్మ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్, కేజీయఫ్ 2, ది కశ్మీర్ ఫైల్స్’ బాగా నచ్చాయన్నాడు. ఇక తన సినిమాల కాంట్రవర్సిపై స్పందిస్తూ.. ‘మెదడులోని ఆలోచనల్నే కథలుగా మలుస్తాను. దేశ పౌరుడిగా రాజ్యాంగంలో నాకున్న హక్కులేమిటో తెలుసు. వాటిని వాడుకుంటున్నాను. ఎదుటి వాళ్లు బాధపడతారని మాట్లాడకుండా ఉంటే అసలు ఏం మాట్లాడలేం’ అంటూ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తిగా సమాధానం ఇచ్చాడు. ‘ఒకవేళ నేను ఎన్నికల్లో నిలబడితే బుద్ది ఉన్నవాళ్లేవరు నాకు ఓటెయ్యరు.
చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురామ్
ఎందుకంటే నేను జనాలకు ఏం చేయననే విషయం వారికి బాగా తెలుసు. నా కోసం నేను బతుకుతాను. రాజకీయ నాయకుల లక్షణం అది కాదు’ అని చెప్పాడు. ఆ తర్వాత తనలాగా బతకాలంటే మూడు విషయాలను అలవరుచుకోవాలన్నాడు. దేవుడు, సమాజం, కుటుంబం వంటి మూడు అంశాలను వదిలేయాలని, అప్పుడు వచ్చే స్వేచ్ఛతో తన లాగా బతకవచ్చని వర్మ వ్యాఖ్యానించాడు. అనంతరం ఎవరైన మీపై కక్ష్యతో చంపాడానికి వస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా.. ఎవరైనా చంపడానికి వస్తే పారిపోనని, వచ్చిన వ్యక్తి కత్తితో పొడిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆస్వాదించి చచ్చిపోతానంటూ వర్మ షాకింగ్ కామెంట్ చేశాడు. దీంతో వర్మ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment