ఎదురుబెదురు లేని మనిషి.. భయం అన్న పదానికి డిక్షనరీలో చోటివ్వని వ్యక్తి.. సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే సినీ డైరెక్టర్.. ఎవరేమన్నా పట్టించుకోని సోలో మ్యాన్ రాంగోపాల్ వర్మ. జనాలు ఎలాంటి సినిమాలు చూస్తారన్న విషయానికి బదులుగా తనకు ఎలాంటి చిత్రాలు తీయాలనుందనేదే ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాడీ ఆర్జీవీ. ఎందరో నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన ఆయన ప్రేక్షకులు తన సినిమాలు బాలేవని తిట్టిపోసినా, బాగుందని చప్పట్లు కొట్టినా అతి సాధారణంగా స్పందిస్తాడు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కుటుంబం తనను చాలాకాలం క్రితమే వదిలేసిందని చెప్పుకొచ్చాడు. నచ్చినట్లు బతకమని ఇంట్లోవాళ్లు తనను ఒంటరిగా వదిలేశారని తెలిపాడు. తన కూతురు అయితే ఏకంగా తాను జూలో ఉండాల్సిన వ్యక్తిని అన్నట్లుగా వింతగా చూస్తుందని పేర్కొన్నాడు. ఇక ట్రోల్స్ గురించి స్పందిస్తూ తనమీద 90 శాతం వరకు ట్రోలింగ్ జరుగుతుందన్నాడు. అయితే తనను ట్రోల్ చేసేవారికి వారికి పనీపాటా లేదని విమర్శించాడు. ఆ ట్రోల్స్ గురించి ఆలోచించి, వాటికి రిప్లై ఇచ్చేంత ఖాళీగా తాను లేనని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment