Rashmika Mandanna on battling online trolls - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: చిన్నచిన్నవాటికే బాధపడేదాన్ని, అనుభవం చాలా నేర్పింది

Published Wed, May 17 2023 4:10 PM | Last Updated on Wed, May 17 2023 4:22 PM

Rashmika Mandanna on Battling Trolls - Sakshi

శాండిల్‌వుడ్‌లో కథానాయికగా పరిచయం అయిన రష్మిక మందన్నా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఈ కన్నడ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్‌, కోలీవుడ్‌ అంటూ కెరీర్‌ను విస్తరించుకుంటూ ఇప్పుడు బాలీవుడ్‌ వరకు ఎగబాకింది. అల్లుఅర్జున్‌తో జత కట్టిన తెలుగు చిత్రం పుష్ప ఈ అమ్మడిని పాన్‌ ఇండియా స్టార్‌ను చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది రష్మిక.

అయితే పండ్లు ఉన్న చెట్లకే రాళ్లదెబ్బలు అన్న సామెత మాదిరి నటి రష్మిక మందన్నపై ఇటీవల విమర్శల దాడి జరుగుతోందని చెప్పవచ్చు. అయితే ఇందులో ఆమె స్వయంకృతాపరాధం కూడా ఉంది. సెలబ్రిటీల నుంచి వచ్చే ప్రతి మాట వార్తే అవుతుంది. అలా తన అనాలోచన వ్యాఖ్యలు రష్మికను విమర్శల్లో పడేసిందని చెప్పక తప్పదు. అయితే నటి రష్మిక వాణి వేరేలా ఉంది. తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన ఈమె ఒక భేటీలో మాట్లాడుతూ.. ఆరంభంలో చాలా కష్టపడ్డానని చెప్పింది.

చిన్న చిన్న సమస్యలు కూడా బాధించేవని చెప్పింది. ఆ తరువాత అనుభవం నేర్పిన పాఠాలతో సమస్యలను చూసే కోణం మారుతూ వచ్చిందని చెప్పింది. కొత్త ఆలోచనతో అడుగులు వేస్తే ఎలాంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయని తనకు అర్థం అయిందని పేర్కొంది. సవాళ్లను ఎదుర్కోవడం అలవాటు చేసుకుంటే ఏది కష్టం అనిపించదని చెప్పింది. సక్రమంగా పని చేస్తున్నానని, విరామం లేకుండా నటించడం వల్ల అలుపు వస్తోందని చెప్పింది. అయినా పలు భాషల్లో నటిస్తూ ఇంతకు ముందు కంటే బిజీగా ఉన్నానని రష్మిక మందన్న పేర్కొంది.

చదవండి: వెధవలకు అటెన్షన్‌ ఇస్తే ఇంకా రెచ్చిపోతారు: నిహారిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement