అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకం చెప్పనవసరం లేదు. ‘ఏం మాయ చేశావే’తో టాలీవుడ్ వెండితెరపై మెరిసిన సామ్.. జెస్సీగా కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే క్రేజ్ వరుస సినిమాలు చేస్తూ సక్సెస్‌తో ముందుకు దూసుకేళుతోంది. ఇక సామ్ వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటు అభిమానులకు చేరువుగా ఉంటోంది. ఈ క్రమంలో సామ్ సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది.
వారం క్రితమే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 15 మిలియన్ల ఫాలోవర్స్‌లో అరుదైన మైలు రాయిని చేరుకున్న సామ్ వారంలోనే ఒక మిలియన్ల ఫాలోవర్స్ సంపాదించుకుంది. దీంతో సామ్‌కు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ల ఫాలోవర్స్ మైలు రాయిని చేరుకుంది. దీంతో సామ్ ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసి అభిమానులకు, ఫాలోవర్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది. కాగా ప్రస్తుతం సమంత శాకుంతల మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో పూజ కార్యక్రమాలు జరుపుకుని షూటింగ్‌ను ప్రారంభించింది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సామ్ లీడ్ రోల్ పోషిస్తుండగా మలయాళం నటుడు దేవ్ మోహన్ కింగ్ దుష్యంత పాత్ర పోషిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment