Samantha Ruth Prabhu Writes Down Not Out After Returning To India From The US - Sakshi
Sakshi News home page

Samantha: వెనక్కి తగ్గా.. ఓడిపోలేదు, సామ్‌ పోస్ట్‌.. ధైర్యం చెబుతున్న నెటిజన్స్‌

Published Sat, Oct 8 2022 11:36 AM | Last Updated on Sat, Oct 8 2022 3:23 PM

Samantha Latest Instagram Post Goes Viral - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. కొత్త సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకునేది. అలాంటి సామ్‌.. ఇటీవల సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో అభిమానుల్లో రకరకాల సందేహాలు వ్యక్తం అయ్యాయి. సామ్‌ అనారోగ్యానికి గురైయ్యారని, చికిత్స కోసం అమెరికా వెళ్లారని గుసగుసలు వినిపించాయి. అంతేకాదు సమంతపై నిర్మాతలు సీరియస్‌గా ఉన్నారని, కొత్త ప్రాజెక్టుల నుంచి ఆమెను తప్పించనున్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి.

ఎట్టకేలకు ఈ ప్రశ్నలన్నింటికీ ఒక పోస్ట్‌తో జవాబుబిచ్చింది సామ్‌. శుక్రవారం రాత్రి సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన పెట్‌ డాగ్‌ ఫోటోని షేర్‌ చేస్తూ ‘వెనక్కి తగ్గా.. ఓడిపోలేదు(డౌన్‌ నాట్‌ అవుట్‌)’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం సామ్‌ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. తన వ్యక్తిగత జీవితం గురించే సామ్‌ ఆ పోస్ట్‌ పెట్టిందని నెటిజన్లు అంటున్నారు. తాను అనారోగ్యంతో బాధపడడం  నిజమే కానీ సురక్షితమేనని అనే మీనింగ్‌ కూడా వస్తోందని అభిమానులు అంటున్నారు.

(చదవండి: బ్రేకప్‌ తర్వాత మళ్లీ కలిసిన దీప్తి సునైనా- షణ్నూ)

సామ్‌ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.  నందిని రెడ్డి  'హలో' అని వ్యాఖ్యానించారు. వరుణ్ ధావన్ కూడా అదే పోస్ట్ లో 'స్ట్రాంగ్' .. 'హాయ్' ఎమోజీలను పోస్ట్ చేశారు. ధైర్యంగా ఉండండి మేడం అంటూ పలువురు అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఇక సినిమా విషయాలకొస్తే.. సామ్‌ నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వరుణ్‌ ధావన్‌తో చేయనున్న ‘సిటాడెల్‌ ఇండియా’ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ నవంబర్‌లో  ప్రారంభం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement