సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాను షేక్ చేసేందుకు మరో సాంగ్ సిద్ధమైంది. ఈ మేరకు చిత్రయూనిట్ మ.. మ.. మహేశా అనే పాట ప్రోమోను రిలీజ్ చేసింది.
ఇందులో బ్యూటిఫుల్ డ్రెస్సింగ్, అదరగొట్టే స్టెప్స్‌తో అదరగొట్టారు మహేశ్, కీర్తి. సన్నజాజి మూర తెస్తా సోమవారం, మల్లెపూల మూర తెస్తా మంగళారం.. అంటూ మహేశ్ స్టెప్పులేయగా.. మ..మ.. మహేశా, నే ము..ము.. ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా అంటూ కీర్తి గ్రేస్‌తో చిందేశింది. పూర్తి పాట వినాలంటే మాత్రం మే 7వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment