చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరోయిన్ అంజనా భౌమిక్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న అంజనా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ‘కహోనా మేఘ్’, ‘థానా థేకే అస్చీ’, ‘చౌరంగీ’ లాంటి క్లాసిక్ చిత్రాల్లో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు అంజనా భౌమిక్. ఆమె అసలు పేరు ఆరతి. కూచ్ బిహార్‌లో జన్మించారు. చదువు కోసం కోల్‌కతా వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు.
చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అంజన ‘అనుస్టూప్ ఛంద’ అనే చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ‘థానా థేకే అస్చీ’ బెంగాలీ చిత్రంలో స్టార్ హీరోయిన్‌గా మారారు. వివాహం తర్వాత సినిమాకు దూరమయ్యారు. 2012లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు -- నీలాంజనా సేన్‌గుప్తా, చందనా శర్మ ఉన్నారు. నీలాంజనా ప్రముఖ నటుడు జిష్షు సేన్‌గుప్తాను వివాహం చేసుకుంది. అంజనా మృతిపట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment