![మాట్లాడుతున్న జడ్జి లలిత శివజ్యోతి - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/20/19mul453-330118_mr_0.jpg.webp?itok=4rAu3aYU)
మాట్లాడుతున్న జడ్జి లలిత శివజ్యోతి
ములుగు రూరల్: అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమార్తి పీవీపీ లలిత శివజ్యోతి అన్నారు. మండల పరిధిలోని కొత్తూరు క్లస్టర్ రాయినిగూడెం రైతు వేదికలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఆమె బుధవారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు భూ సమస్యలు, నకిలీ విత్తనాలు, పురుగు మందుల అమ్మకాలు, పంట రుణాలు, పంట నష్టం, బీమా, అమ్మకాలతో మోసం జరిగితే న్యాయ సలహాలు అందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. రైతుల హక్కులకు భంగం కలిగిన, నష్టం జరిగిన సమయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశంలో పేద మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు 1987లో లీగల్ సర్విస్ చట్టం వచ్చిందని 1995 నుంచి చట్టం అమలు అమలవుతుందని అన్నారు. రైతులు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఉపయోగించుకొని చట్టపరమైన సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంత రైతుల సమస్యలను పారా లీగల్ వాలంటీర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల సమస్యలను దరఖాస్తు రూపంలో న్యాయ సేవా అధికార సంస్థకు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి మాధవి, జిల్లా వ్యవసాయ అధికారి గౌస్‌హైదర్, ఏడీఏ శ్రీపాల్, మండల వ్యవసాయ అధికారి సంతోష్, బార్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి మేకల మహేందర్, బాలుగు చంద్రయ్య, అశోక్, రైతులు పాల్గొన్నారు.
జడ్జి లలిత శివజ్యోతి
Comments
Please login to add a commentAdd a comment