కార్తీక శోభ
కార్తీక పౌర్ణమి నేపథ్యంలో శుక్రవారం ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి.. మహిళలు భక్తితో దీపాలు వెలిగించారు. గోదావరి పరివాహక ప్రాంత భక్తులు నదీ స్నానం ఆచరించి నదిలో దీపాలను వదిలారు. ఉసిరి, తులసి చెట్టు వద్ద పూజలు చేసి కోర్కెలు తీర్చాలని వేడుకున్నారు. – సాక్షి నెట్‌వర్క్
మహిళా ఓటర్లే అధికం..
సుమారు ఎనిమిదిన్నర నెలల వ్యవధిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లతో పాటు చనిపోయిన, ఇతర ప్రాంతాలకు మారిన వారిని తొలగిస్తూ.. అక్టోబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటించింది. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల్లో 14,86,220 మంది పురుష ఓటర్లు, 15,46,039 మంది మహిళలు, 499 ఇతరులు కలిపి మొత్తం 30,32,758 మంది ఓటర్లున్నట్లు పేర్కొన్నారు. ఈజాబితాలోనూ పురుషలకంటే మహిళా ఓటర్లే 59,819 ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లో చనిపోయిన, మరో ప్రాంతానికి మార్పిడి చేసుకున్న, రెండేసి ఓట్లు, ఇంకా ఇతర కారణాల తో 27,338 మంది పేర్లు తొలగించి, 55,21 9 మంది కొత్త ఓట ర్లను చేర్చినట్లు ఎన్ని కల సంఘం డ్రాఫ్ట్ జా బితాలో వెల్లడైంది. కాగా.. జాబితాపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయొచ్చని ప్ర కటించిన ఎన్నికల సంఘం.. ఈనెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరించేలా ఉదయం నుంచి సాయంత్రం వర కు పోలింగ్‌స్టేషన్లలో బూత్‌లెవెల్ అధికారులు (బీఎల్‌ఓలు) అందుబాటులో ఉండేలా ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment