ఐలాపురానికి తరలిన అధికారులు
శబరిమలకు స్పెషల్ రైళ్లు..
కాజీపేట జంక్షన్ మీదుగా శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాలధారులు, భక్తులకు స్పెషల్ రైళ్ల సర్వీస్‌లు నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
వాతావరణం
ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉంటుంది. సాయంత్రం నుంచి చల్లగాలులు, రాత్రి పొగమంచుతో చలి తీవ్రత ఉంటుంది.
– 8లోu
ఏటూరునాగారం/కన్నాయిగూడెం : దట్టమైన అటవీ ప్రాంతం..ఐటీడీఏకు 37 కిలోమీటర్ల దూరంలోని గిరిజన పల్లెకు అధికార యంత్రాంగం తరలివెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేను జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ఐలాపురంలోని 209 కుటుంబాలు బహిష్కరించాయి. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న ములుగు జిల్లాలో కేవలం ఒకే ఒక గ్రామస్తులు బహిష్కరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు బుధవారం గిరిజన పల్లెకు పరుగులు పెట్టారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాతో పాటు జిల్లా, మండల అధికారులు అడవిబాట పట్టారు. ఐలాపురంలోని 209 కుటుంబాలతో పీఓ సమావేశమయ్యారు. ఐలాపురం గ్రామంలో 1983లో దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ ఆశ్రమ పాఠశాలను మంజూరు చేశారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రోడ్డు మార్గం లేదని మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య పీఓకు వివరించారు. రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నామని గోడు వెల్లబోసుకున్నారు. సర్వే చేయాలి అంటే తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన పీఓ గ్రామంలో ఉన్న సమస్యలను, రోడ్డు మార్గం ఏర్పాటుకు మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు సర్వే చేసేందుకు అంగీకరించారు. దీంతో 20 ఎన్యుమేటర్లతో ఒకే రోజు సర్వే చేసి ముగించారు.
జాతర ఏర్పాట్ల పరిశీలన
ఐలాపురంలో సమ్మక్క–సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని, జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు. జాతరకు సిరివంచ నుంచి వచ్చే భక్తులకు అడవిమార్గంలో దారిని చదును చేయించాలని, గద్దెల వద్ద విద్యుత్ దీపాలు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, ఆర్చీ నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించాలని పూజారులు, గ్రామస్తులు కోరారు. ఈమేరకు పీఓ ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను ముందుగా గుర్తించి నివేదిక ఇవ్వాలని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రంను ఆదేశించారు. అలాగే మినీ మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం అడవిమార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు, అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా పనిచేయాలన్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యాలు, బోధన, భోజనాన్ని పీఓ పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ వీరభద్రం, తహసీల్దార్ వేణు, ఎంపీడీఓ అనిత, స్పెషల్ ఆఫీసర్ ఏపీడీ వెంకటనారాయణ, ఎంపీఓ సాజీదాబేగం, ఆర్‌అండ్‌బీ డీఈఈ కుమారస్వామి, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, అటవీశాఖ అధికారులు, ఎస్‌డీసీ డీటీ అనిల్, జీసీడీఓ సుగుణ, సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఒకే రోజు 20 మందితో
209 కుటుంబాల సర్వే
మినీ మేడారం,
ఐలాపురం జాతరపై దృష్టి
Comments
Please login to add a commentAdd a comment