ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు మేడారం పరిసర ప్రాంతాల్లోని చెత్తను సేకరించి శుభ్రం చేస్తున్నారు. భక్తుల క్యూలైన్‌లలో పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు. బుధవారం మేడారంలో పారిశుద్ధ్య పనులను డీపీఓ దేవరాజు పరిశీలించి కార్మికులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మినీ మేడారం జాతరలో అమ్మవార్లకు మొక్కులు సమర్పించేందుకు ముందస్తుగా వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా పారిశుద్ధ్య పనులు చేపడతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాజమండ్రి నుంచి 60 పారిశుద్ధ్య కార్మికులను రపించామని తెలిపారు. జాతర నాటికి మరికొంత మంది పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment