‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
కన్నాయిగూడెం: పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను పీఓ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మరుగుదొడ్లు, ఉపాధ్యాయులకు క్వార్టర్స్, నీటి వసతి, విద్యుత్ సరఫరా, డ్రైయినేజీ తదితర సమస్యలు ఉన్నాయని తెలిపారు. తక్షణమే సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పీఓ వెల్లడించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
Comments
Please login to add a commentAdd a comment