ఇసుక క్వారీల నిర్వహణకు గ్రామసభలు
వాజేడు: మండలంలోని టేకులగూడెం, చెరుకూరు ఇసుక క్వారీల నిర్వహణ కోసం బుధవారం ఎంపీడీఓ విజయ, ఎంపీఓ శ్రీకాంత్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ముందుగా టేకులగూడెం సభను నిర్వహించగా అక్కడి ప్రజలు సభకు మద్ధతు తెలిపారు. 200 మంది వరకు హాజరు కాగా అందరూ చేతులెత్తి తమ మద్దతు ప్రకటించారు. కోరం సరే అనడతో గ్రామ సభ ఓకే అయినట్లు అధికారులు ప్రకటించి సంతకాలు తీసుకున్నారు. అనంతరం చెరుకూరు ఇసుక క్వారీ కోసం గ్రామసభను ఏర్పాటు చేశారు. సభకు తక్కువ మంది ప్రజలు హాజరుకావడంతో కోరం సరిపోలేదు. దీంతో గ్రామ సభను వాయిదా వేసి గురువారం ఉదయం 9 గంటలకు తిరిగి నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ, ఎంపీఓలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment