పొగమంచుతో అధిక ప్రమాదాలు
● రాత్రి పూట ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి
● జైపాల్‌రెడ్డి, సీనియర్ ఎంవీఐ, వరంగల్ ఆర్టీఏ
ఖిలా వరంగల్: ప్రస్తుతం విపరీతమైన చలితోపాటు పొగ మంచు కురుస్తోంది. రహదారులను కమ్మేస్తోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫాడ్ లైట్లు వాడితే 25మీటర్ల వరకు స్పష్టంగా చూడొచ్చు. నాలుగు చక్రాల వాహనం ఒకే లైటుతో ప్రయాణిస్తే ఎదురుగా వచ్చే వారు ద్విచక్ర వాహనమనుకుని, పక్కనుంచే వెళ్లే అవకాశం ఉంది. రెండు హెడ్‌లైట్లు డిప్ చేస్తూ ప్రయాణించాలి. మూలమలుపుల వద్ద అతివేగం పనికి రాదు. వాహనాలను ఓవర్‌టేక్ చేయడం వల్ల ఎదురుగా వచ్చేవి కనిపించవు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి వెనుక లైట్లు వెలిగేలా చూసుకోవాలి. పొగ మంచులో కాంతి పరావర్తనం చెంది ఎదురు వాహనాలు కనిపించవు. వాహనానికి ముందు, వెనుక రేడియం స్టిక్కర్లు అతికించాలి. రహదారిని చూడగలిగే పరిస్థితులకు అనుగుణంగా వాహన వేగం ఉండాలి. ఇతర వాహనదారులు తమను గమనించేలా హజార్డ్ లైట్ వాడాలి. లోబీమ్ ఫాగ్ లైట్లు ఉండేలా చూడాలి. నేషనల్ హైవే, శివారు రహదారులపై వాహనాల మధ్య కచ్చితంగా దూరం పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment