రహదారి పనులు చేపట్టాలని రాస్తారోకో
వెంకటాపురం(కె): రహదారి మరమ్మతు పనులను వెంటనే చేయాలని కోరుతూ మండలంలోని కొండాపురం రహదారిపై గ్రామస్తులు, రైతులు రాస్తారో కో చేశారు. రహదారి మరమ్మతుల కోసం తవ్విన కాంట్రాక్టర్ పనులను పూర్తి చేయకపోవడంతో దు మ్ములేచి ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లేచిన దుమ్ము పంట చేలపై పడి తెగుళ్ల బారిన పడుతున్నట్లు వాపోయారు. మరమ్మతులు చేపట్టాలని కోరుతూ సుమారు గంట పాటు వెంకటాపురం(కె), భద్రాచలం రహదారిపై బైఠాయించా రు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ మల్లయ్య అక్కడికి వెళ్లి వారికి నచ్చ జెప్పడంతో రాస్తారోకోను విరమించారు. ఆ తరువాత వెంకటాపురం(కె) ఎస్సై తిరుపతిరావు ట్యాంకర్ ద్వారా దుమ్ము లేస్తున్న చోట రహదారిపై నీటిని చల్లించారు.
వాహనం బోల్తా..
ఇద్దరికి గాయాలు
చిట్యాల: మండలంలోని నైన్‌పాక శివారులో బుధవారం రాత్రి టాటాఏస్ వాహనం బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని అందుకుతండాకు చెందిన భూక్యా సతీష్, దామరశెట్టి వీరయ్యలతో పాటు మరో ఇద్దరు రాంనర్సయ్య, లింగమూర్తిలు పరకాలకు వారి వ్యక్తిగత పనినిమిత్తం వెళ్లి తిరుగు వస్తున్న క్రమంలో నైన్‌పాక శివారులోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే 108కు సమాచారం అందించారు. అనంతరం 108 వాహన సిబ్బంది క్షతగాత్రులను చిట్యాల ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment