మంగపేట: మండలంలోని కొందరు కేబుల్ నెట్‌వర్క్ నిర్వాహకులు కొంత కాలంగా కేబులల్ టీవీ ప్రసారాలు చేసేందుకు ఎల్‌టీ లైన్ నుంచి అక్రమంగా విద్యుత్ వాడుతూ చౌర్యానికి పాల్పడుతున్నారనే సమాచారం మేరకు విద్యుత్ విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించినట్లు సమాచారం. కమలాపురంతో పాటు మండల వ్యాప్తంగా కేబుల్ టీవీ ప్రసారాలు చేస్తున్న నిర్వాహకులు విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ వైర్లను అమర్చి సిగ్నల్స్‌ను పంపించేందుకు అవసరమైన చోట నోడ్స్, ఆంప్లీఫైర్స్, ఫవర్‌పాస్ యూనిట్లకు ఎల్‌టీ లైన్ నుంచి అక్రమంగా విద్యుత్‌ను వాడుతూ వ్యాపారం చేస్తున్నారనే ఫి ర్యాదు మేరకు దాడులు నిర్వహించేందుకు వచ్చి నట్లు సమాచారం. కమలాపురంలో అక్రమంగా 40 చోట్లకు పైగా అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకో కుండా నిర్వాహకులతో కలిసి మంతనాలు జరిపిన ఎలాంటి దాడులు చేయకుండా వెల్లినట్లు తెలిసింది. పూరిగుడిసెల్లో కరెంటు బిల్లు వాడే నిరుపేదపై కేసులు పెట్టే ఎన్‌పీడీసిఎల్ అధికారులు విద్యుత్తు చౌర్యానికి పాల్పడే కేబుల్ ఆపరేటర్లపై చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఏఈ సుబ్బరామశర్మను వివరణ అడుగగా కమలాపురంలోని జియో కేబుల్ నెట్‌వర్క్ 3477 సర్వీస్ నంబర్‌పై రూ. 4.60 లక్షల బకాయి ఉండటంతో వసూలు చేసేందుకు వచ్చామని నిర్వాహకులు బకాయి చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరడంతో నాలుగు రోజుల సమయం ఇ చ్చామన్నారు. గ్రామంలో విద్యుత్ చౌర్యానికి పాల్ప డుతున్నట్లు ఫిర్యాదు రావడంతో డీపీఈ వింగ్ విజిలెన్స్ అధికారులు గ్రామంలో దాడులు నిర్వహించి అక్రమంగా చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించామని అవి ఏ కేబుల్ వ్యాపారివనేది విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment