డీఎంహెచ్‌ఓ సేవలు మరువలేనవి
ములుగు : జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామా ల వాసులకు హనుమకొండ జిల్లాకు బదిలీపై వెళ్లిన డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య గత 8 ఏళ్ల పాటు గొ ప్ప సేవలు అందించారని వైద్యారోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఏటూరునా గారం ఏజెన్సీలో వర్షాకాలంలో వాగులు వంకలు దాటుకుంటూ గిరిజనులకు వైద్యం అందించడం మరువలేనిదని అన్నారు. ఈ క్రమంలో గవర్నర్ ద్వారా ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు. గిరిజన, గొత్తికోయ గూడేల వాసులకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎస్‌ఎస్ తాడ్వాయి, వాజేడు మండలాల్లో కంటైనర్ ఆస్పత్రుల ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. ఆశా కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమన్వయంగా మెలిగారని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది అప్పయ్యతో పాటు నూతన డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావును గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీశ్వర్, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పవన్‌కుమార్, డాక్టర్ చంద్రకాంత్, సంపత్, దుర్గారావు, పూర్ణసంపత్‌రావు, గణేశ్, కిరణ్, సతీశ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యాశాఖాధికారులు
Comments
Please login to add a commentAdd a comment