ఆపరేటర్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
ములుగు రూరల్: సబ్‌స్టేషన్ ఆపరేటర్ల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కులో విద్యుత్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ పిలుపు మేరకు ధర్నాకు వెళ్తున్న ఆపరేటర్లను అరెస్టు చేయడంపై సరికాదని ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సంస్థల్లో గతకొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లను గత ప్రభుత్వం పర్మనెంట్ చేసి ఆర్డర్స్ ఇచ్చింది కాని ఆర్టిజన్స్ పేరుతో మోసం చేసిందని వెల్లడించారు. తక్షణమే ప్రభుత్వం ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో యూనియన్ జిల్లా నాయకుడు జయరాజు, సుధాకర్, రాజు, రఘుపతి, సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment