మంగపేట: మండల పరిధిలోని చెరుపల్లికి చెందిన నలుగురు రైతులపై తేనెటీగలు దాడిచేయడంతో శనివారం గాయపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతులు రాంగాని నరేందర్, బరుపటి నర్సింహారావు, అచ్చె దేవేందర్, నాగబెల్లి అరుణాచారి పొలాల వద్దకు వెళ్లి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో రెడ్డిచెరువు కట్టపై చెట్టుకు ఉన్న తేనె టీగలు ఒక్కసారిగా దాడిచేసి తీవ్రంగా కుట్టాయి. స్వల్పంగా గాయపడిన అచ్చె దేవేందర్, రాంగాని నరేందర్, బరుపటి నర్సింహారావు స్థానిక ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. అరుణాచారిని తేనెటీగలు తీవ్రంగా కుట్టడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బ్లడ్ ఇన్‌ఫెక్షన్ అయిందని మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లాలని సూచించగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. . సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాప్రాయం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment